జీవో నెంబర్55 ను వెంటనే వెనక్కి తీసుకోవాలి
బీరకాయలు వివేక్ వర్ధన్ ఏబీవీపీ రాష్ట్ర కార్యసమితి సభ్యుడు
సిద్దిపేట జిల్లా జనవరి 25
సిద్దిపేట జిల్లా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ ఉద్యాన వర్సిటీ భూములు లను హైకోర్టుకు కేటాయించవద్దు జీవో నెంబర్ 55ను గవర్నమెంట్ వెంటనే వెనక్కి తీసుకోవాలి అని నిన్న యూనివర్సిటీ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థుల పైన రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ పైన పోలిసులు క్రూరంగా జుట్టు పట్టుకోని బైక్ పైన లాగుతూ వెళ్లడం ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గ పాలనకు నిదర్శనం అని వెంటనే దీనికి కారణమైన కానిస్టేబుల్స్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తు సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యసమితి సభ్యుడు వివేక్ వర్ధన్ట్ వ్యవసాయ ,ఉద్యాన వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించవద్దని గత నెల రోజులుగా యూనివర్సిటి వద్ద ఏబీవీపీ నిరసనలు, ధర్నా లు చేయడం జరుగుతుంది. అగ్రికల్చర్ వర్సిటీ అంటేనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి మేలు చేకూర్చి దేశంలోనే అగ్రగావి రాష్ట్రంగా మార్చాలె ,రైతులకు నష్టాలు జరగకుండా రైతులు పండించే ప్రతి పంటకు లాభం వచ్చే విధంగా నూతన వంగడాలను విత్తనాలను పై పరిశోధన మరియు అభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడిన వర్సిటీ అలాంటి వర్సిటీలో 35 సంవత్సరాలుగా మెడిసిన్ ప్లాంట్స్, వెజిటేబుల్స్ సీడ్స్ ఆ గ్రూప్ లు ఫారెస్ట్రీ మొదలగు వాటిపై ఎన్నో రకాల పరిశోధనలు జరిగి తెలంగాణ రాష్ట్రంలో రైతులను మరియు రైతాంగాన్ని పటిష్టం చేయడానికి ఎనలేని కృషి చేయడం జరుగుతుంది.
కానీ నేడు అగ్రో బయోడైవర్సిటీ కొనసాగుతున్న పార్కులో రాష్ట్ర హైకోర్టుకు సంబంధించిన భవనాలను కట్టడానికి జీవో నెంబర్ 55 ను తీసుకోవచ్చు. యూనివర్సిటీలో దాదాపుగా 100 ఎకరాల భూమిని తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది కానీ హైకోర్టు బిల్డింగ్ ను ఈ ప్రాంగణంలో కట్టొద్దని ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.
అగ్రికల్చర్ వర్సిటీలో హైకోర్టు భవనాలను కట్టడం అంటే తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ రంగాన్ని తుంగలో తొక్కి వ్యవసాయ అభివృద్ధికి అడ్డుకట్ట వేయడమేనని అదేవిధంగా గ్రామీణ విద్యార్థులు విద్యను దూరం చేసి పరిశోధనలు జరగకుండా ప్రభుత్వం కుట్ర పొందుతుందని ఏబీవీపీ తెలుపుతుంది.కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించి నిర్ణయం వెనక్కి తీసుకోవాలి లేని పక్షంలో ఏబీవీపీ రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని కార్యచరణ రూపొందించి యూనివర్సిటీలో గుంట భూమి కూడా వదలమని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏబీవీపీ హెచ్చరిస్తుంది అని అన్నారు…
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కన్వీనర్ అరుంధతి,జిల్లా హాస్టల్స్ కన్వీనర్ చరణ్ ,రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పవన్,నగర కార్యదర్శి హరీష్, జోనల్ ఇంచార్జ్ నందు, కౌశిక్ ,సంజయ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
