– మోటివేషన్ స్పీకర్ తిరుపతి
(మానకొండూర్ జనవరి )
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దటంలో తల్లితండ్రులు, గురువులు పాత్ర వెలకట్టలేనిదని మోటివేషన్ స్పీకర్ కే తిరుపతి అన్నారు…
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం కేంద్రములో ప్రభుత్వ జూనియర్ కళాశాల , మానకొండూరు ప్రభుత్వ జిల్లాపరిషత్ పాఠశాల, ఊటూర్ జడ్పీహేచ్ఎస్ పాఠశాలలోని విద్యార్థులకు మంగళవారం ఇంపాక్ట్ ఫౌండర్ గంప నాగేశ్వర్ రావు ట్రైనర్ కుర్రే తిరుపతి (పోలిస్ హెడ్ కానిస్టేబుల్), తనతో దాసరి ప్రశాంత్, జర్నలిస్టు అంజి, దాసరి కల్యాణి లతో మంగళవారం మానకొండూరు మండల పరిధిలోని విద్యార్ధులకు మోటివేషన్ క్లాసెస్ తీసుకున్నారు..
ఈ కార్యక్రమం లో ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, సర్టిపైడ్ లైఫ్ స్కిల్స్ ట్రైనర్ తిరుపతి విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ…
విద్యార్థులను భావి భారత పౌరులు గా తీర్చి దిద్దడంలో తల్లిదండ్రుల, గురువుల పాత్ర) వెలకట్ట లేనిదని,ప్రతి విద్యార్ధి ఒక లక్ష్యం పెట్టు కోని దాన్ని సాధించడం కోసం నిరంతరం కఠోర శ్రమ చేయాలని వివరించారు.
ప్రస్తుత సమాజంలో సామాజిక మధ్యమాల ప్రభావం విద్యార్థుల పై, యువత పై విపరీతంగా ఉందని దాని బారినుంచి విద్యార్థులను బయటికి తీసువస్తే యువతకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని దిశా నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమం లో మానకొందూరు జూనియర్ కాలేజ్ ప్రిన్స్ పాల్ అంజన్ రావు, జడ్పీ హెచ్ ఎస్ హెచ్ ఎం శ్రీనివాస్, ఊటూరు ఇంచార్జి హెచ్ ఎం రమాదేవి, స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ అద్యక్షులు పడాల రమేశ్, లెక్షరర్లు, ప్రధానోపాధ్యాయులు,
టీచర్స్ ,తదితరులు పాల్గోన్నారు.