మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల ద్వితీయ సమ్మేళనం నాయనందకరంగా జరిగింది.
ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంకు పూర్వ విద్యార్థులు హాజరయ్యారు.చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్న మిత్రులు ఆనందంతో ఉత్సాహంతో ఒకరి నొకరు అలాయిబలై చేసుకుంటూ కుశల ప్రశ్నలు వేసుకున్నారు. సుదీర్ఘకాలం తర్వాత కోలుకున్న కొంత మంది మిత్రుల కళ్ళలో ఆనంద భాష్పాలు దొర్లయి.
1975 నుంచి 1995 వరకు విద్యాభస్యం చేసిన పూర్వ విద్యార్థుల ద్వితీయ సమ్మేళనాన్ని ఆదివారం పద్మనాయక ఫంక్షన్ లో ఏర్పాటు చేశారు. సుదూర ప్రాంతాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు తమ మిత్రులను కలుసుకోవాలని ఉత్సాహంగా తరలివచ్చారు. ఒకరోజు ముందుగానే కొంతమంది మంచిరాలకు వచ్చారు. పూర్వ విద్యార్థి అయిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తన మిత్రబృందంతో చర్చించి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి కొన్ని నెలల క్రితం అంకురార్పణ చేశారు.
ఆదివారం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయగా పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. పూర్వ విద్యార్థుల పలకరింపులు.. చిరునవ్వులు ఆత్మీయ పలకరింపులతో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా చిన్ననాటి చిలిపిచేస్థలను ఒకరినొకరు చెప్పుకుంటూ తమ అనుభవాలను పంచుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 05 గంటల వరకు కొనసాగింది. ఆత్మీయ సమ్మేళనానికి విద్యాబుద్ధులు బోధించిన అధ్యాపకులు హాజరయ్యారు. వారిని పూర్వ విద్యార్థులు సంఘం తరఫున ఘనంగా సత్కరించారు. కళాశాలలో విద్యాభ్యాసం చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించిన అనేక మందిని వేదిక ద్వారా పరిచయం చేశారు.
తొలి సమావేశం లో ప్రకటించిన కళాశాల అభివృద్ధి నిధులను పూర్వ విద్యార్థులు చెల్లించారు. గ్రూప్ ఫోటో దిగేందుకు పూర్వ విద్యార్థులు పోటీ పడ్డారు.
