(మానకొండూర్ జనవరి 21)
బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, తిమ్మాపూర్ మండల మన్నెంపల్లి ఉపసర్పంచ్ పొన్నం అనిల్‌గౌడ్ రూపొందించిన 2024 సంవత్సర క్యాలెండర్‌ను రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు మానకొండూర్‌లో ఆదివారం ఆవిష్కరించారు.
అనంతరం మండల అధ్యక్షుడు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డికి క్యాలెండర్లు అందించారు.
ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ..
లోక్‌సభ ఎన్నికలకు బీఆర్‌ఎస్ శ్రేణులు సమాయత్తం కావాలన్నారు. కాంగ్రెస్ తప్పుడు హామీలతోనే అసెంబ్లీ ఎన్నికల్గో గెలిచిందన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ తేలిపోతుందని పేర్కొన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన‍్న సీఎం రేవంత్‌రెడ్డి 45 రోజుల పాలనతో కేవలం ఒక్క హామీ మాత్రమే పూర్తిగా అమలు చేశారన్నారు. ఈ విషయాలను నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమములో బీఆర్‌ఎస్ నాయకులు నాంపల్లి శంకర్, నార్ల అశోక్, గుంటి వెంకటేష్, సుదగొని సదయ్య గౌడ్, దరిపల్లి వేణు కుమార్, గీకురు రమేష్, బీనపల్లి సంపత్, బుడిధ రంజిత్, తదితరులు పాల్గొన్నారు.




