(తిమ్మాపూర్, జనవరి 16 )
నుస్తులాపూర్ సర్పంచ్ రావుల రమేష్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన నుస్తులాపూర్ ప్రీమియర్ లీగ్ సెవెన్ క్రికెట్ టోర్నీ సోమవారం ముగిసింది. నిర్వాహకులు నాలుగు రోజుల పాటు పోటీలు నిర్వహించారు.
మంగళవారం నిర్వహించిన ఫైనల్‌లో నుస్తులాపూర్ సీనియర్ టీం, రామక్రిష్ణకాలనీ జట్లు హోరాహోరీగా తలపడగా, నుస్తులాపూర్ సీనియర్ జట్టు గెలుపొందింది.రామక్రిష్ణకాలనీ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది.నుస్తులాపూర్ సీనియర్ జట్టులోని కొంటు రంజిత్, ఆస్లామ్, నిసార్, ఆక్రమ్, కార్తిక్, అరుణ్, నేహల్, రమేష్, విక్రమ్,రావుల అభయ్, ముజ్జు, సమ్మి, ఆటలో ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.. విజేతలకు నుస్తులాపూర్ సర్పంచ్ రావుల రమేష్ షీల్డ్‌లు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బేతి శ్రీనివాస్ రెడ్డి, ,నూనె సురేష్,వంగల శ్రీనివాస్ రెడ్డి టోర్నమెంట్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.