జన కల్యాణ్ దివాస్ బెహన్ జీ మాయావతి జన్మదిన వేడుకలు
……..ఆమె పాలన దేశానికి ఆదర్శం
పేద, బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి, ఉక్కుమహిళ ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, జాతీయ అధ్యక్షురాలు బెహన్ కుమారి మాయావతి పుట్టినరోజు వేడుకలను ఈరోజు గజ్వేల్ అసెంబ్లీ అధ్యక్షులు మొండి.కరుణాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జీలు కెతోజి వినోద్ , కొండనోళ్ల నరేష్ మాట్లాడుతూ కుమారి మాయావతి 68 వ పుట్టిన రోజు సందర్భంగా వేడుకలను నిర్వహిస్తూ దేశ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని జనకళ్యాణ్ దివాస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
అదే విదంగా దేశంలో అంబేడ్కర్ ఆశయాల కోసం ,కాన్షిరం అడుగు అడుగుజాడల్లో నడుస్తూ యూపీ లో 7 లక్షల విద్యార్థినులకు 15000 రూపాయలు, సైకిళ్ళు ఇచ్చి, 3,25000 ఆడపిల్లలకు మహామాయ గరీబ్ బాలిక యోజన స్కీం ద్వారా ఒక్కరికి లక్ష రూపాయలు ఇచ్చి ,3 1/2 లక్షల మంది పేదలకు ఇండ్లు నిర్మించి సుపరిపాలన అందించిన పాలన దేశానికే గర్వకారణంగా బెహేన్జీ మాయావతి పాలన ,బెహేన్జీ సారథ్యంలో తెలంగాణ లో ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కనుగుల రమణకర్ ,అసెంబ్లీ ఇసి మెంబర్స్ కనకప్రసాద్ ,& జే.నవీన్ , మార్కుక్ మండల ఉపాధ్యక్షులు నవీన్, ప్రధాన కార్యదర్శి వంశీ,పట్టణ అధ్యక్షులు కొలుపుల స్వామి, బాగనోల్ల రామచంద్రము, రాము, శ్రీశైలం ,అనిల్, పరమేష్ ,గణేష్ ఇతర నాయకులు పాలుగొన్నారు.





