ప్రాంతీయం

మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలలో ప్రతిరోజు త్రాగునీరు

219 Views

ఎన్నికల హామీలో భాగంగా మంచిర్యాల,నస్పూర్ మున్సిపాలిటీ లో ప్రతిరోజు స్వచ్ఛమైన తాగునీరు పథకంను సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు.

కాలేజ్ లో విద్యాభ్యాసం చేసే సమయంలో అద్దెకు ఉన్న అశోక్ రోడ్ లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరంనస్పూర్ మున్సిపాలిటీ లోని 14వ వార్డు రాజీవ్ నగర్ లో తాగునీటి పథకంను ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లా నీటిని సేవించారు.

తాగునీరు పథకం పనులను వేగవంతంగా పూర్తి చేసిన మున్సిపల్, మిషన్ భగీరథ, ఆర్.డబ్ల్యు.ఎస్.,మున్సిపల్, పబ్లిక్ హెల్త్ అధికారులను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పూలమాల, శాలువాలతో సన్మానించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతిరోజు తాగునీటి పథకం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఉదయం గంట, సాయంత్రం అరగంట పాటు తాగునీరు సరఫరా అవుతుందన్నారు. తాగునీరు వృధా చేయకుండా అవసరమైన మేరకు వాడుకుని నల్లా కట్టేయాలని సూచించారు. అలాగే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు పథకాలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. బీఆరెస్ మాదిరిగా అసత్య హామీలు, బూటకపు మాటలు చెప్పమని ఆయన అన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులు ఆన్ లైన్ లో నిక్షిప్తమయ్యాయని అధికారులు దరఖాస్తు దారుల వద్దకు వచ్చి వివరాలపై ఆరా తీస్తారని అర్హులైన వారిని పథకాలకు ఎంపిక చేస్తారని ఆయన వివరించారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ మోతిలాల్ మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలను లబ్ధిపొందడానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇచ్చిన హామీలను ఎమ్మెల్యే తప్పకుండా నెరవేరుస్తారని కాబోయే మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తూముల నరేశ్,కాబోయే వైస్ చైర్మన్ సల్ల మహేష్, 17వ వార్డు కౌన్సిలర్ పూదరి సునీత ప్రభాకర్ , ఇతర వార్డుల కౌన్సిలర్ లు, తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *