మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ చే రహీమ్ బ్లడ్ ఆర్గనైజర్ కి ఘనంగా సన్మానం.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి బొబ్బిలి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నాడు 161వ స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన ఉత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని సైన్స్ సెంటర్లో ఘనంగా యువ దినోత్సవం నిర్వహించారు,
మంచిర్యాల జిల్లా రహీమ్ బ్లడ్ ఆర్గనైజర్ గత ఎనిమిది సంవత్సరాలు నుండి అత్యవసర సమయంలో గర్భిణీ స్త్రీలకు మరియు యాక్సిడెంట్ అయిన పేషంట్లకి రక్తం అందించి వారి ప్రాణాలు కాపాడిన అబ్దుల్ రహీం, ప్రేమ్ మరియు తలసేమియా మరియు సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల కొరకు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూన్న అబ్దుల్ రహీం ప్రేమ్ కుమార్ సింఘ్ కి , మరియు మల్యాల శ్రీపతి, సందేశ్ గుప్తా కి మెమొంఠం ఇచ్చి శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతిలాల్, అతిథులుగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాప్రసాద్, జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి పురుషోత్తం నాయక్లు మరియు యువతరం తిరుపతి హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు,
ఈ సందర్భంగా ముఖ్యఅతిథి జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ మరియు అతిథులు స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు, అనంతరం మోతిలాల్ మాట్లాడుతూ యువత అన్ని రంగాలలో ముందు ఉండాలని పిలుపునిచ్చారు, యువతీ యువకులు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలని తెలియజేశారు,
ఈ సందర్భంగా 20 యువజన సంఘాలు, యువకులకు రక్తదాన కార్యక్రమాలలో, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలలో వివిధ సేవా కార్యక్రమాలలో పాల్గొన్న వారికి శాలువలు మేమంటలతో సర్టిఫికెట్లతో ఘనంగా సన్మానించారు,
ఈ కార్యక్రమంలో యువజన, కార్యక్రమం ప్రారంభంలో చిన్నారి అకిరా జాను చేసిన నృత్యం అందరిని ఆకట్టుకుంది.
