ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవస్థానం కార్తీకమాస బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని తేదీ 4.11.2022 నుండి తేదీ 10.11.2022 వరకు జరగబోయే ఉత్సవాలలో భాగంగా మంగళవారం రోజున అంకురార్పణ, దీక్షాస్వీకరంతో స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి అలాగే నవంబర్ 6వ తారీఖున ఆదివారం స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఉదయం 11: 00గంలకు జరుగుతుంది, అలాగే ప్రతి సంవత్సరం లాగానే కార్తీక పౌర్ణమి రోజున అనగా
తేదీ 8 11 2022 మంగళవారం రోజున ఉదయం 6 గంటలకు గరుడ సేవ కార్యక్రమం జరుగుతుంది. చంద్ర గ్రహణ కారణంగా తేదీ 9.11.2022 బుధవారం రోజున ఉదయం ఆలయ సంప్రోక్షణ జరుగుతుంది, అలాగే చంద్రగ్రహనాన్ని దృష్టిలో ఉంచుకొని వేద విజ్ఞులైనటువంటి బ్రాహ్మణుల సూచనల మేరకు రథోత్సవ కార్యక్రమాన్ని కార్తీక పౌర్ణమి రోజు కాకుండా తదుపరి రోజున అనగా పాడ్యమి రోజున అనగా తేదీ 9.11.2022 బుధవారం రోజున సా.6:00 గంటల నుండి నిర్వహించాలనేటువంటి సదుద్దేశంతో ఆలయ కమిటీ మరియు గ్రామ సర్పంచ్ , ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు మరియు గ్రామ పెద్దల అధ్యక్షతన ఒక నిర్ణయం తీసుకొని రథోత్సవాన్ని ఒకరోజు ముందుకు జరిపి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులంతా ఇది గమనించి ప్రతి ఏటా జరిగే రథోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము అలాగే తేదీ 10 నవంబర్ 2022 రోజున స్వామివారి ఏకాంత సేవతో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ముగుస్తున్నాయి. వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు
