Breaking News

కరీంనగర్ లో సిఐ, ఎస్ఐ లు బదిలీలు..

9,519 Views

(కరీంనగర్ డిసెంబర్ 30)

కరీంనగర్ కమిషనరేట్లో పనిచేస్తున్న పలువురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ మల్టీ జోన్ వన్ ఐజీ తరుణ్ జోషి శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

ఎస్బీలో పని చేస్తున్న ఓ. వెంకటేష్ ను కరీంనగర్ టూ టౌన్ కు, టాస్క్ఫోర్స్ లో పనిచేస్తున్న సరిలాల్ ను కరీంనగర్ వన్ టౌన్ కు బదిలీ చేశారు. కరీంనగర్ వన్ టౌన్లో పనిచేస్తున్న రవికుమార్, టూ టౌన్లో పనిచేస్తున్న రామ చంద్రరావు, తిమ్మాపూర్లో పనిచేస్తున్న ఇంద్రసేనారెడ్డిలను మల్టీజోన్ వన్ ఐజీ కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

సబ్ ఇన్స్పెక్టర్ల బదిలీలు..

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో పనిచేస్తున్న పలువురు సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ మల్టీజోన్ వన్ ఐజీపీ తరుణ్ జోషి శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

టాస్క్ఫోర్స్లో పనిచేస్తున్న వంశీకృష్ణను వీణవంకకు, సీఎస్ బీ లో పనిచేస్తున్న చేరాలును ఎల్ఎండికి, కరీంనగర్ త్రీ టౌన్లో పనిచేస్తున్న రమేష్ను రామడుగు పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు.

ఎల్ఎండిలో పనిచేస్తున్న ప్రమోద్ రెడ్డి,రామడుగులో పనిచేస్తున్న తిరుపతి, వీణవంకలో పనిచేస్తున్న ఆసీఫ్ మహమ్మద్ లను వీఆర్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు….

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *