(శంకరపట్నం మండలం 26)
కరీంనగర్ జిల్లా శకరపట్నం మండలంలోని మెట్ పల్లి గ్రామానికి చెందిన తోట బసవయ్య అనే వ్యక్తికి చెందిన పూరిల్లు కరెంటు షార్ట్ సర్క్యూట్ పూర్తిగా తో కాలిపోయింది.ఈ సంఘటన జరిగినప్పుడు కుటుంబ సభ్యులు పొలం పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఇంట్లో వున్నా లక్షా 50వేల రూపాయల నగదు తో పాటు విలువైన బట్టలు, వంట సామాగ్రి, టీవీ పూర్తిగా కాలిపోయినవి..
బాధితులు పేదవారు కావడంతో వారి రోదనలు మిన్నంటాయి.
కూతురి వివాహం కోసం భద్రపరచుకున్న 1,50,000
వేల రూపాయలు పూర్తిగా మాడి మసైపోయాయి.
ప్రభుత్వము వెంటనే తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు..