24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 17)
బిఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా కార్యాలయం లో పార్టీ కార్పొరేటర్లు, నాయకులు మరియు కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన గణేష్ బిగాల
ఈ సందర్బంగా గణేష్ బిగాల మాట్లాడుతూ
కార్యకర్తలు అధైర్య పడొద్దు ఎప్పటిలాగే ప్రజల సమస్యలపై స్పందిస్తూ అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాల్లో ముందుండాలన్నారు.
మనకు పదవులు కొత్త కాదు మనం వచ్చింది ఉద్యమ పార్టీ నుండి ప్రజా సమస్యలపై పోరాడుతూ ముందుకెళదాం అని అన్నారు.
ఈ సమావేశంలో మేయర్ నీతూ కిరణ్,పార్టీ నగర అధ్యక్షులు మరియు కార్యదర్శి సిర్ప రాజు ,ఏనుగందుల మురళి, మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, నగర కార్పొరేటర్లు నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.





