సిద్దిపేట్ డిసెంబర్ 17: జిల్లా రైతుల ప్రయోజనాల కోసం రంగనాయక సాగర్ లోకి నీటిని పంపింగ్ చేయాలి.
మిడ్ మానేరు నుండి 1.50 టీ ఎం సి నీటిని పంప్ చేసి యాసంగి పంటకు సాగు నీటిని ఇవ్వాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి కి లేఖ ద్వారా కోరిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు.
రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ కు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ.
నిన్న శాసన సభ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కల్సి లేఖ ను అందజేసిన హరీష్ రావు .
సిద్దిపేట జిల్లా రైతంగానికి యాసంగి పంటకు నీళ్లు అందిచాలని, అందుకు అవసరమగు నీటిని మిడ్ మానెర్ నుండి రంగనాయక సాగర్ కి నీటిని పంప్ చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి మాజీ మంత్రి, సిద్దిపేట శాసన సభ్యులు హరీష్ రావు లేఖ వ్రాసారు.. ఈ మేరకు నిన్న శనివారం రోజున శాసన సభ లో మంత్రిని కల్సి లేఖ ను అందజేశారు..
నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో తెలంగాణకు అత్యంత ముఖ్యమైన నీటిపారుదల శాఖగా బాధ్యతలు చేపట్టిన మీకు మనసారా శుభాకాంక్షలు అని ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలిపారు.
సిద్దిపేట జిల్లా రైతాంగ ప్రయోజనాలకు సంబంధించిన ముఖ్యమైన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళుతున్నట్లు చెప్పారు. గత మూడు సంవత్సరాలుగా జిల్లాలో సాగు భూములకు రంగనాయక సాగర్ ద్వారా సాగునీరు అందజేయడం జరిగింది. దీని వల్ల పంట దిగుబడి పెరిగి రైతుల బతుకుల్లో సంతోషం నిండింది. ఈ యేడు వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో యాసంగి పంటకు సరిపోయే నీరు రిజర్వాయర్ లో లేక రైతాంగం ఆందోళనకు గురవుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.. యాసంగికి నీళ్లు అందించాలంటే మూడు టీఎంసీల నీరు ఉండాలి. కానీ ప్రస్తుతం రంగనాయక సాగర్ రిజర్వాయర్ లో 1.50 టీఎంసీ మాత్రమే ఉంది. తమరు రైతాంగ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని వెంటనే మిడ్ మానేరు నుండి 1.50 టీఎంసీల నీళ్లు రంగనాయక సాగర్ కు వచ్చే విధంగా పంపింగ్ చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించవలసిందిగా లేఖ ద్వారా మనవి చేశారు…
గత మూడు సంవత్సరాలుగా అందించిన విధంగానే ఈసారి కూడా యాసంగి పంటకు కావలసిన సాగునీరు అందే విధంగా చర్యలు చేపట్టవలసిందిగా సిద్ధిపేట జిల్లా రైతాంగం పక్షాన హరీష్ రావు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కల్సి లేఖ అందజేసి విజ్ఞప్తి చేశారు…