భార్య పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న కలెక్టర్ గన్మెన్ సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామునిపట్లలో దారుణం జరిగింది. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ ఆకుల నరేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు భార్య చైతన్య, ఇద్దరు పిల్లలు రేవంత్ హిమశ్రీని చంపేసి గన్తో కాల్చుకున్నాడు ఈ రోజు ఉదయం డ్యూటీకి రాకపోవడంతో సిబ్బంది ఇంటికి వెళ్లి చూడగా నలుగురు రక్తపు మడుగులో కనిపించారు కుటుంబ కలహాలే కారణమా మరేవైనా సమస్యలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది
