రాజకీయం

కేసిఆర్ ను పరామర్శించిన సినీ నటుడు ప్రకాశ్ రాజ్

224 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 11)

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ని పరామర్శించేందుకు ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ యశోద దవాఖానా కు చేరుకున్నారు.
ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి గురించి ఆరా తీశారు. కోలుకుంటున్న విషయం తెలుసుకున్నారు.
అదే సందర్భం లో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ లు మధుసూదన చారి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి మోత్కుపల్లి., చల్మడ లక్ష్మి నరసింహారావు తదితరులు కూడా కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి గురించి తెలుసుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *