జగిత్యాల డిసెంబర్ 9:కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర సాధకులు,బంగారు తెలంగాణ స్వాప్నికుడు కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాము…. జెడ్పీ చైర్మన్ దావ వసంతసురేష్.
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పూర్తి ఆరోగ్యంతో తిరిగి కోలుకోవాలని జగిత్యాల అర్బన్& రూరల్ మండల మరియు పట్టణ బి.అర్.ఎస్ నాయకులతో కలిసి జగిత్యాల అర్బన్ మండల అంబారిపెట్ గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినప్పటికీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ మీద ఉన్న నమ్మకంతో 39 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ప్రతిపక్ష హోదాలో పెద్ద బాధ్యతలు ఉంచారని తెలంగాణ రాష్ట్రానికి ఇంకా కేసీఆర్ సేవలు చాలా అవసరమని పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగిన అనుభవంతో అటు ప్రభుత్వానికి ఇటు ప్రతిపక్ష హోదాలో ప్రజలకు మార్గదర్శనం చేసి తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్ ఇంకా ఎన్నో సేవలు అందించాలని కేసీఆర్ త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని…ఆ భగవంతున్ని వేడుకున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మహేష్,అర్బన్ ఎంపీపీ ములాసపు లక్ష్మి,పాక్స్ చైర్మన్లు మహిపాల్ రెడ్డి,సందీప్ రావు,మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్,బి.అర్.ఎస్ పార్టీ పట్టణ అద్యక్షుడు గట్టు సతీష్,రూరల్ మండల పార్టీ అద్యక్షుడు బాలముకుందం,సర్పంచ్లు,ఎంపీటీసీలు,కౌన్సిలర్లు,నాయకులు,కార్యకర్తలు,మహిళలు,బి.అర్.ఎస్ పార్టీ కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు…