మంచిర్యాల ఎమ్మెల్యేగా విజయం సాధించిన కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును మంత్రి పదవి వరిస్తుందని కాంగ్రెస్ నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. మంగళవారం మంచిర్యాల లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, మున్సిపల్ ప్రతిపక్ష ఉప నాయకుడు వేములపల్లి సంజీవ్ మాట్లాడారు.
నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి గెలిపించగా కాంగ్రెస్ అధిష్ఠానం ప్రేమసాగర్ రావు పార్టీ కోసం చేసిన సేవలను గుర్తించి మంత్రి వర్గంలో చోటు కల్పిస్తోందని అన్నారు. ప్రేమ్ సాగర్ రావు ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గంను తప్పకుండా అభివృద్ధి చేస్తారని తెలిపారు. అన్ని మండలాల్లో ప్రేమ్ సాగర్ రావుకు అత్యధికంగా మెజార్టీ కట్టపెట్టిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
