గెలుపైన, ఓటమైన ప్రజలతోనే- బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ రఘునాథ్ వెరబెల్లి.
మంచిర్యాల అసెంబ్లీలో బీజేపీ పార్టీకి 40 వేల ఓట్లు వేసి రెండో స్థానంలో నిలిచినందుకు ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ రఘునాథ్ పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ మంచిర్యాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి 40 వేల ఓట్లు వేసి మమ్మల్ని రెండో స్థానంలో నిలిపిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తామని వచ్చే అన్ని ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. బీజేపీ కార్యకర్తల కృషి వల్లే బీజేపీ పార్టీ కి 40 వేల ఓట్లు వచ్చాయని తెలిపారు. పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ నుండి MLA గా ప్రేమ్ సాగర్ కి శుభాకాంక్షలు మంచిర్యాల నియోజవర్గ అభివృద్ధికి మరియు పేద ప్రజల సంక్షేమానికి కృషి చేయాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో తెలిపిన హామీలను నెరవేర్చాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో రజినిష్ జైన్, మున్న రాజ సిసోడియా, మొటపలుకుల తిరుపతి, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, బోలిషెట్టి తిరుపతి, కమలాకర్ రావు, తుల ఆంజనేయులు, రంగ శ్రీశైలం, కషెట్టి నాగేశ్వర్ రావు, బొయిని హరికృష్ణ, గాజుల ప్రభాకర్, సత్రం రమేష్, ఆకుల సంతోష్, అమిరిషెట్టి రాజు, చిప్పరి రాజ మల్లయ్య, మల్లేష్, సతీష్ మరియు తతిదరులు పాల్గొన్నారు.
