మంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గం.
రాష్ట్రంలో, మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టపోతున్న ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.
శుక్రవారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.బీఆరెస్ పై విసిగిన ప్రజలు మార్పు కోరుకున్నారని చెప్పారు. బీఆరెస్ కు ప్రత్యామ్నాయ ముగా కాంగ్రెస్ ను ఎన్నుకుని అధికారంలోకి తీసుకురావడానికి కంకణ బద్ధులు కావడం అభినందనీయమని కొనియాడారు.
కాంగ్రెస్ అధికారపగ్గాలు చేపట్టగానే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తుందని భరోసా ఇచ్చారు. మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు తనపై చూపిన ఆదరణను విస్మరించబోనని తెలిపారు. మంచిర్యాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమాన్ని అందిస్థానని అన్నారు.
ఇంద్రవెళ్లి సభతో కాంగ్రెస్ కు మళ్ళీ పూర్వవైభవం వచ్చిందని తెలిపారు. మంచిర్యాల లో ఏర్పాటు చేసిన సభకు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే రావడంతో జాతీయ స్థాయిలో మంచిర్యాల కు గుర్తింపు లభించిందని అన్నారు.
