కౌకుంట్ల మండలం తిర్మలాపూర్ (నవంబర్ 27)
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు మరింత లబ్ధ్ది చేకూరేవిధంగా ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించారని, దాని వల్ల రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆలవెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా గ్రామంలోని పార్టీకార్యకర్తలు, మహిళలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించి కారుగుర్తుకు ఓటువేయాలని కోరారు.
పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కేసీఆర్‌ను మూడోసారి కూడా ముఖ్యమంత్రి కావాలని, ప్రజల ఆశీర్వాదం కోరుతున్నట్లు తెలిపారు.
సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన మ్యానిఫెస్టోతో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ ఫలం అందుతుందని తెలిపారు.
ఇతర పార్టీల అభ్యర్థులు అవగాహన రాహిత్యంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కనబడుతలేదా అని ప్రశ్నించారు. మేము చేసిన పనులు కాంగ్రెస్ వచ్చిన తరువాత చేస్తామని చెప్పడం వారికే చెల్లిందన్నారు.
వ్యవసాయానికి మూడు గంటలు కరెంటు చాలన్న రేవంత్‌రెడ్డి అభ్యర్థులను తెలంగాణ నుంచి తరిమేందు కు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
