సిద్దిపేట జిల్లా నవంబర్ 26
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
ఈ రోజు గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలం గుంటిపల్లి గ్రామంలో ఆత్మీయ బీఆర్ఎస్ పార్టీ రోడ్ షో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధీగా తెలంగాణ రాష్ట్ర ఎఫ్ డీ సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి రావటం
జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల వారిని ఆదుకుంటాం అందరు కెసిఆర్ కి ఓట్లు వేసి భారీ మెజారిటీ తొ గెలిపించి మూడవ సారి ముఖ్యమంత్రి గ చేసుకుందాం అని పిలుపునిచ్చారు. అదేవిధంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ల మాయ మాటలు నమ్మి మోసపోవద్దు,కొత్త బిచ్చగాడు వచ్చినట్టు ఎప్పుడు వాళ్ళు వచ్చి పోతారు కానీ బీఆర్ఎస్ పార్టీ అన్నివేళలా మీకు అందుబాటులో ఉంటుంది అని భరోసా ఇచ్చారు. గుంటిపల్లి నుండి గోవిందా పూర్ వరకు బీటీ రోడ్ మరియు గుంటుపల్లి నుండి మైలారం వరకు బీటీ రోడ్ వేపిస్తం అని హామీ ఇవ్వడం జరిగింది
