– రేణికుంట కాంగ్రెస్ విజయబేరి సభలో టీసీపీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
(తిమ్మాపూర్ నవంబర్ 23)
తిమ్మాపూర్ మండలం రేణిగుంట గ్రామం లో గురువారం నిర్వహించిన మానకొండూర్ నియోజకవర్గం కాంగ్రెస్ విజయభేరి సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రేవంత్‌కు డీసీసీ అధ్యక్షుడు, మానకొండూర్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ ఘన స్వాగతం పలికారు. అనంతరం సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన నాయకురాలు సోనియమ్మ అని అన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో సిద్ధిపేటలో ఉన్న కేసీఆర్ తర్వాత కరీంనగర్, మహబూబ్‌నగర్, తర్వాత గజ్వేలకు చేరాడని, ఇప్పుడు గజ్వేల్ ప్రజలను కూడా మోసం చేసి కామారెడ్డికి పారిపోయిండన్నారు. తాను, తన కుటుంబం కోసం ఆలోచించే కేసీఆర్ పదేళ్లలో తెలంగాణను అప్పుల కూపంలోకి నెట్టారన్నారు. బంగారు తెలంగాణ పేరుతో ప్రజలను మభ్యపెడుతూ తన కుటుంబాన్ని బంగారు మయం చేసుకున్నాడని ఆరోపించారు.
ఈ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న కేసీఆర్‌ను రెండు చోట్ల బొంద పెడ్తమని రేవంత్ అన్నారు. కామారెడ్డి భూములపై కన్నేసిన కేసీఆర్ ఇప్పుడు అక్కడి నుంచి పోటీ చేస్తున్నారన్నారు. అధిష్టానం ఆదేశాల మేరకు తాను కేసీఆర్‌పై కామారెడ్డిలో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఆయన ఫామ్ హౌస్ కట్టుకుండు తప్ప ప్రజలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదు. కేసీఆర్ నకిలీ వంద రూపాయల నోటు లాంటివాడు.నకిలీ నోటు జేబులో ఉన్నా దానికి విలువ ఉండదన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను గద్దె దింపి ఇందిరమ్మ రాజ్యం తెస్తామనితెలిపారు. దొరల పాలనను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఉన్నది మూడు అడుగులు ఆరడుగులు దుంకుతడు అని ఎద్దేవా చేశారు. రసమయి ఎమ్మెల్యే అయ్యాక ఈ ప్రాంత ప్రజలకు చేసిందేం లేదు. తెలంగాణ పాటను రసమయి దొర గడీల తాకట్టు పెటిండని ఆరోపించారు. ఉద్యమకారుడని రెండుసార్లు గెలిపిస్తే రసమయి కేసీఆర్‌కు బానిసలా పనిచేస్తున్నాడని, ఆరోపించారు.