మేడ్చల్ నవంబర్ 23
24/7 తెలుగు న్యూస్
మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి కార్యాలయంలో ఈరోజు జరిగిన శ్రీసత్యనారాయణ స్వామి వ్రతానికి హాజరై పూజలు చేశారు. బహదూర్ పల్లిలో జరిగిన వివాహ వేడుకకు హాజరై నూతన వధూ వరులను ఆశీర్వదించారు. అదే విదంగా సూరారంలో జరిగిన గృహ ప్రవేశానికి హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, పోలీస్ గోవింద్ రెడ్డి, శివ యాదవ్, శివ, సంగోళ్ళ రమేష్, తదితరులు పాల్గొన్నారు.
