కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఖాళీ
నవంబర్ 21
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం జగదేవపూర్ మండలం జంగంరెడ్డిపల్లిలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఖాళీ అయ్యాయని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. జంగంరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ దుబ్బాక కుమార్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చెరుకు అశోక్ పటేల్ వంటేరు ప్రతాప్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.
జంగంరెడ్డిపల్లిలో కాంగ్రెస్ ఖాళీ అయిందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీతోనే గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ది సాధ్యమన్నారు. ఆయనతో చెరుకు ప్రవీణ్, చెరుకు వెంకటేశ్, పుణుకు శ్రీనివాస్, బోయిని శేఖర్, బోయిని తిరుపతిలతో పాటు మరో 20 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఫాక్స్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీల ఫోరం జిల్లా కన్వీనర్ కిరణ్ గౌడ్, జగదేవపూర్ మాజీ సర్పంచ్ కొంపల్లి కరుణాకర్ ఉన్నారు.





