ఎమ్మెల్యేగా గెలవగానే పోతిరెడ్డిపల్లి గ్రామ సమస్యలు పరిష్కరిస్తా
మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి
నవంబర్ 13
సిద్దిపేట్ జిల్లా చేర్యాల ఎమ్మెల్యేగా గెలవగానే పోతిరెడ్డిపల్లి గ్రామంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి, ఆయన కుమారుడు కొమ్మూరి రాకేష్ రెడ్డి గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. గ్రామంలో నెలకొన్న పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ..
పోతిరెడ్డి పల్లి నుండి పెద్దరాజుపేట వరకు బీటి రోడ్డు వేస్తానని, నూతన బస్టాండు నిర్మాణం, గ్రామంలో యువకులు చదువుకునేందుకు గ్రంథాలయ నిర్మాణం చేపడతానని, వాటర్ ప్లాంట్ నిర్మించి ఉచితంగా త్రాగునీరు అందిస్తామన్నారు.
పోతిరెడ్డిపల్లి చెరువుకు వెళ్లే దారిలో కెనాల్ కాల్వపై బ్రిడ్జి నిర్మాణం చేపడతానని, గ్రామంలో డ్రైనేజీ కాలువ నిర్మాణం చేపడతానని, పోతిరెడ్డి పల్లె గ్రామం నుండి రాంసాగర్, పడమటి కేశవాపూర్ కు లింకు రోడ్లు వేయిస్తానని హామీ ఇచ్చారు. హామీతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కమిటీ సభ్యులు కత్తుల భాస్కర్ రెడ్డి, చేలుకల బాల్రెడ్డి, మిల్కురి భాను, చెలుకల మహిపాల్ రెడ్డి, హరికృష్ణ,రాజు, తిరుపతి, మల్లయ్య, సోమరాజు తదితరులు పాల్గొన్నారు.
