సిద్దిపేట జిల్లా:నవంబర్ 13
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
సిద్జిధిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ భూ నిర్వాసితులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఓట్లేస్తామని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నితుడు వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ జాంగిర్ కు ఏకగ్రీవ తీర్మానా పత్రాన్ని కొండపోచమ్మ సాగర్ భూ నిర్వాసితులు అందజేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ జాంగిర్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా గోదావరి నుండి ఎత్తిపోతల పథకం ద్వారా గజ్వేల్ నియోజకవర్గానికి మల్లన్న సాగర్ , కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి రైతులకు అండగా నిలిచారని , భూములు కోల్పోయిన వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిర్వాసితులు అండగా ఉంటామని భరోసా ఇచ్చారని ఆయన తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని జిమ్మిక్కులు చేసి మాయమాటలు చెప్పిన తమ ప్రాంతాన్ని శశశ్యామలం చేసిన ఘనత కేసిఆర్ కి దక్కిందని నీళ్లు లేక కరువుతో అల్లాడిన వ్యవసారంగాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిపారని వ్యవసాయ రంగంపై ఆధారపడిన తమ జీవితానికి వెలుగులు నింపారని భూ నిర్వాసితులు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పనులకు ప్రశంసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. జరగబోయే ఎన్నికల్లో భూ నిర్వాసులమంతా ముఖ్యమంత్రి కేసీఆర్ కే ఓట్లు వేస్తామని తెలిపారని మార్కెట్ కమిటీ చైర్మన్ జాంగిర్ తెలిపారు .తీర్మాణ పత్రాలను ముఖ్యమంత్రి కేసీఆర్ కు జహంగీర్ అందజేశారు.
