హిమాయత్ నగర్ పార్టీ ఆఫీస్ లో దళిత బహుజన పార్టీ,వ్యవస్థాపక అధ్యక్షులు, సుప్రీం కోర్ట్ అడ్వకేట్ గౌరవనీయులు శ్రీ, వడ్లమూరి కృష్ణ స్వరూప్ చేతుల మీదుగా, దళిత బహుజన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భువనగిరి నియోజకవర్గ అభ్యర్థి యువ నాయకులు బీరం సతీష్ కుమార్ కి పార్టీ బి ఫారం అందించిన వడ్లమూరి కృష్ణ స్వరూప్.
ఈ సందర్భంగా బీరం సతీష్ మాట్లాడుతూ దళిత బహుజనుల రాజ్యం కోసం మనందరం కలిసికట్టుగా పోరాటం చేసి మన బహుజన రాజ్యం తెచ్చుకోవాలి అని అన్నారు, అలాగే ఇప్పుడున్న రాజకీయ పార్టీలతో పోరాటం చేస్తామని దళిత బహుజన శక్తి చాటి చెపుతామని వడ్లమూరి కృష్ణ స్వరూప్ గారికి హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎన్నికల కమిటీ చైర్మన్ వి ఎల్ రాజు మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పల్లవి సాంబయ్య పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ప్రవీణ్ పాల్గొనడం జరిగింది.






