విద్యార్థి,నిరుద్యోగ, ప్రజా సంఘాల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎస్.వి.శ్రీకాంత్
సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీని ఓడించండి
నవంబర్ 8
సిద్దిపేట నియోజకవర్గ విద్యార్థి,నిరుద్యోగ, ప్రజా సంఘాల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పీ.డీ.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్ ను ఎన్నికల బరిలో నిలుపుతున్నట్లు వివిధ విద్యార్థి,ప్రజా సంఘాల నాయకులు ప్రకటించారు.
సిద్దిపేట అంబెడ్కర్ సర్కిల్ లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో విద్యార్థి,నిరుద్యోగ, ప్రజా సంఘాల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్.వి.శ్రీకాంత్ మాట్లాడుతూ పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులను కోట్లాది రూపాయల స్కాలర్షిప్,ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా మరియు నిరుద్యోగులను డిఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించకుండ,ఉద్యోగాలను భర్తీ చేయకుండా తీవ్రంగా మోసం చేసిందని అన్నారు.
సిద్దిపేట నియోజకవర్గంలోని దళితుల,బిసిల భూములను పల్లె ప్రకృతి వనాలు,రైల్వే లైన్,వివిధ ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు,ప్రాజెక్టుల నిర్మాణానికి తీసుకొని బీఆర్ఎస్ పార్టీ వారందరినీ నిర్వాసితులను చేసిందని,దళితులకు మూడెకరాల భూమిని ఇస్తామని వాగ్ధానం చేసిన పాలకులు ,దళితులకు ఉన్న భూమిని కూడా గుంజుకుందని ప్రజలంతా దీన్ని గమనించాలని కోరారు.సిద్దిపేటలో ప్రశ్నిస్తున్న వ్యక్తుల పై నిర్భందాన్ని ప్రయోగిస్తూ తన్నీరు హరీష్ రావు నియంత పాలనకు తెరలేపారని గుర్తు చేశారు.అభివృద్ధికి నిదర్శనం కోమటి చెరువు అని స్థానిక మంత్రి ప్రకటించడం నిజంగా విడ్డూరమని ,అభివృద్ది అంటే గ్రామాల్లో ఉండే సాధారణ ప్రజల సామాజిక,ఆర్థిక,రాజకీయ పరిస్థితుల్లో మార్పు రావాలని తెలిపారు.ఎంతోమంది నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు కారణం అయిన బీఆర్ఎస్ పార్టీని సిద్దిపేట అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు.సుదీర్ఘ కాలంగా ప్రజల కొరకు నిజాయితీగా పనిచేస్తున్న విద్యార్థి,ప్రజా సంఘాలు బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఇఫ్టు రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతా భూమేశ్వర్, డిబీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు భీం శేఖర్,న్యాయవాదులు విజయ్,రాజ్ కుమార్,పునేందర్,పీ.డీ.ఎస్.యు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహేష్, విద్యానాథ్,పివైఎల్ జిల్లా యక్షుడు అనిల్,నిరుద్యోగులు శివ,రాజు,జనార్ధన్,విద్యార్థి సందీప్, సంఘం నేతలు అగస్టిన్,సాయి కార్తీక్,వెంకట్,వంశీ,అభిషేక్,తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
