రోడ్డు వెడల్పును తగ్గించాలని ఆందోళన..
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అశోక్ మద్దతు
నవంబర్ 2
సిద్దిపేట జిల్లా చేర్యాల : జనగామ నుండి చేర్యాల జాతీయ రహదారి రోడ్డు విస్తరణలో భాగంగా చేర్యాల పట్టణంలో రోడ్డు ఇరుపక్కల సమానంగా 40 ఫీట్ల చొప్పున వెడల్పు మార్కింగ్ చేసి అండర్ గ్రౌండ్ నిర్మాణం చేపట్టాలని సీపీఐ కార్యవర్గ సభ్యుడు అందె అశోక్ డిమాండ్ చేశారు. గురువారం చేర్యాల పట్టణ కేంద్రంలో జాతీయ రహదారి రోడ్డు ఇరుపక్కల సమాన మార్గంలో అండర్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని అన్నారు.
రోడ్డుకు ఒక పక్కన 39 ఫీట్లు మరోపక్క 45 ఫీట్లు అత్యధికంగా మార్కింగ్ వేసి పనులు చేపట్టడం సరికాదని మండిపడ్డారు. రెండు వైపులా రోడ్డుకు 40 ఫీట్ల చొప్పున కొలతలు చేపట్టి నిర్మాణం చేపట్టాలని ఆందోళన చేపట్టారు. దీంతో వెంటనే డిప్యూటీ డీఈవో రాజు సంఘటన స్థలానికి చేరుకొని డీఈవో కిరణ్ తో మాట్లాడి చిరు వ్యాపారులు, దుకాణదారులు, ఇంటి యజమానులకు ఇరుపక్కల 40 పీట్ల వరకే నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చి వెళ్లారు.
ఈకార్యక్రమంలో ఆర్య వైశ్య యువజన విభాగం అధ్యక్షుడు అయిత సంపత్, కిరాణా వర్తక సంఘం అధ్యక్షుడు శేరి బాల్ నారాయణ, పాత భాస్కర్, వంగపల్లి శ్రీనివాస్ గుప్త, పెద్ది రమేష్, ఎనిశెట్టి నర్సింహా, దాసరి నర్సింహులు,వెల్దె ప్రసాద్, పోతుగంటి రాములు, హరినార్థిని వేణుగోపాల్, డిదిగం నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.
