పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపీఎస్ ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ కళాబృందం సభ్యులు మంథని పోలీస్ స్టేషన్ పరిధిలోని మంథని పట్టణ కేంద్రం లోని అంబేద్కర్ చౌరస్తాలో పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ పాటలు పాడారు. అదేవిధంగా ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుంది అని, ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసమే పోలీసులు ఉన్నారనే విషయాన్ని మరవద్దని తెలిపారు. మహిళల రక్షణ కొరకు పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యల, భద్రత యాప్ లు సైబర్ క్రైమ్,డైల్ 1930, డయాల్ 100 గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.
పోలీస్ కళాబృందం సభ్యులు నాతరి శ్రీనివాస్ ఇనుముల సమ్మయ్య దాసరి సదానందం దంతెనపల్లి సంపత్ జెరుపుల రవీందర్ దేవ సత్యనారాయణ దాసరి అమర్ నాథ్ మరియూ మాజీ రిటైర్డ్ కళాబృందం సభ్యుడు కట్ల భద్రయ్య పాల్గొన్నారు.
