గజ్వేల్ అడ్డా కెసిఆర్ అడ్డా.
ప్రధాని అయినా ఈటెలైనా డిపాజిట్ గల్లంతే.
వేల కోట్లతో గజ్వేల్ అభివృద్ధి.
ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు మ్యాకల కనకయ్య.
అక్టోబర్ 25
సిద్దిపేట జిల్లా గజ్వేల్ అడ్డా బిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కెసిఆర్ అడ్డా అని గజ్వేల్ లో ప్రధానమంత్రి మోడీ అయినా ఈటల వచ్చి పోటీచేసిన డిపాజిట్ గల్లంతే అని మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు సిద్దిపేట జిల్లా ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు మ్యాకల కనకయ్య ముదిరాజ్ అన్నారు.
బుధవారం ఆయన మర్కుక్ లో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ నేతృత్యంలో ఎన్నడు లేని విధంగా అభివృద్ధి పథంలో పరుగులు పెడుతుందన్నారు, గజ్వేల్ నియోజకవర్గంలోని గ్రామాలు వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగిందని దేశంలోనే గజ్వేల్ నియోజకవర్గం రోల్ మోడల్ గా నిలిచిందన్నారు గజ్వేల్ నియోజకవర్గంలో ఈటెల కాదు జేజమ్మ వచ్చిన డిపాజిట్ ఒక్కదని ఎద్దేవా చేశారు. గజ్వేల్ ఓటర్లు కెసిఆర్ వెంటే ఉంటామని ఆయా గ్రామాల ప్రజలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తూ లక్ష ఓట్ల మెజార్టీ కి పైగా గెలిపించి సీఎం కెసిఆర్ కు కానుకగా ఇవ్వనున్నారన్నారు.
రాష్ట్రంలో బిజెపి కాంగ్రెస్ పార్టీలు గెలిచే ప్రసక్తే లేదని గజ్వేల్ ఓటర్లు ప్రజా నాయకుడు రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ వెంటనే ఉన్నారన్నారు. రానున్న ఎలక్షన్ లో భారీ మెజార్టీతో సీఎం కెసిఆర్ గెలిపిస్తామని ప్రజలు అభివృద్ధి చేస్తున్న పార్టీని నాయకులను ఆదరించాలన్నారు.





