గులాబీ జెండానే ప్రజలకు అండ.
లక్షేట్టిపేట్ : గులాబీ జెండానే ప్రజలకు నిజమైన అండ అని మంచిర్యాల నియోజకవర్గ ఇంచార్జ్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ గారు,ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు గారు,ఎంపీ వెంకటేష్ నేత గారు, మాజీ ఎమ్మెల్యే అరవింద రెడ్డి గారుఅన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎస్పీఆర్ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీ ఆర్ ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భాను ప్రసాద్ గారు మాట్లాడుతూ…. ఓటుకు నోటు కేసులో దొరికిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి, ఆ పార్టీకి ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. ప్రజలకు అండగా బీ ఆర్ ఎస్ అధినేత కే సీ ఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీలో నాయకులకు, కార్యకర్తలకు విలువ లేదన్నారు. ప్రజలు అభివృద్ధిని చూసి ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాన్ని బీ ఆర్ ఎస్ కు కట్టబెట్టాలని కోరారు.
మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు గారు మాట్లాడుతూ…. గులాబీ జెండాతోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని వివరించారు. ఆసరా, కళ్యాణ లక్ష్మీ, రైతు భీమా, రైతు బంధు, ఉచిత విద్యుత్ ఇంకా ఎన్నో పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఇంకా నూతన పథకాలతో ప్రజలకు మరింత సేవలు అందిస్తామని తెలిపారు. పేకాట క్లబ్ నాయకులకు అధికారం ఇస్తే మీ పిల్లల భవిష్యత్ నాశనం అవుతుందన్నారు.
అనంతరం జడ్పీటీసీ ముత్తే సత్తయ్య ఆధ్వర్యంలో పలు గ్రామాల నుంచి సుమారు 2వేల మంది నాయకులు,కార్యకర్తలు బీ ఆర్ ఎస్ కండువా కప్పుకున్నారు. అంతకుముందు పాత బస్ స్టాండ్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ వెంకటేష్ నేత, మాజీ ఎమ్మెల్యే అరవింద రెడ్డి,జడ్పీటీసీ ముత్తే సత్తయ్య, మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య, చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పార్టీ అధ్యక్షులు పాదం శ్రీనివాస్,చుంచు చిన్నయ్య, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
