బీజేపీ పార్టీ కి రాజీనామా చేసిన బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి.
అక్టోబర్ 20
మద్దూర్ , నర్సయపల్లి గ్రామానికి చెందిన బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి బీజేపీ పార్టీ కీ రాజీనామా చేసారు, జనగామ మరియు సిద్ధిపేట జిల్లాలో అతి తక్కువ సమయంలో తనకంటూ ఒక మంచి నాయకునిగా గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి.
అంతే కాకుండా పార్టీ లొ మంచి ప్రాధాన్యతను సంపాదించుకున్నారు అయన, బీజేపీలొ అగ్ర నాయకుల వరకు సస్సంబంధాలు ఏరాపరుచుకున్నారు, అధికార పార్టీ ఎన్ని ఇబంధులకు గురు చేసిన తల వంచని నాయకునిగ, జనగాం, సిద్ధిపేట జిల్లాలో వ్యక్తిగతం గా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు శ్రీనివాస్ రెడ్డి.
అయన మాట్లాడుతూ, బీజేపీ పార్టీ ఒక గొప్ప సిద్ధంతాల పార్టీ, నాకు రాజకీయ మనుగడ నేర్పిన పార్టీ అలాంటి పార్టీ కీ రాజీనామా చేయడం, బాధగా వున్న, మా సొంత గ్రామం అయిన నర్సయపల్లి, ముద్దుబిడ్డ కాంగ్రెస్ అభ్యర్తి కొమ్మూరి ప్రతాప రెడ్డి కి జనగామ అసెంబ్లీ టికెట్ రావడం సంతోషం గా ఉందని, త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరాబోతున్నానని అయన అన్నారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గెలవడం కాయం అని, జనగాం ప్రాంతంలొ రాక్షస పాలన అంతం అవ్వాలి అంటే లోకల్ వ్యక్తిని గెలిపించుకోవాలి అని పార్టీ మరియు కుల, మత బేధం లేకుండా అందరూ కలిసి రావాలని అయన కోరారు.





