మేరీనాట్ స్కూల్ లో స్ట్రాంగ్ రూములను, డిస్ట్రిబ్యూషన్ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్
అక్టోబర్/20
వికారాబాద్
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా వికారాబాద్ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి కార్యాలయం, మేరీనాట్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసే స్ట్రాంగ్ రూమ్, ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రంను వికారాబాద్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఓట్ల ఎన్నికల సామాగ్రి పంపిణీ, ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ ఉన్న కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. ఈవీఎంల భద్రతాపరమైన , రవాణా పార్కింగ్ సదుపాయాలతో పాటు ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.
ఎలాంటి అవాంతరాలకు తావు లేకుండా ఎన్నికల నిర్వహణ సాఫీగా జరిగేలా అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల సామాగ్రి పంపిణీలో భాగంగా సిబ్బందికి అప్పజెప్పాల్సిన వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించి అందజేసేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
దినపత్రికల్లో, లోకల్ ఛానల్లో వచ్చే వార్తలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కలెక్టర్ తెలిపారు. పెయిడ్ ఆర్టికల్స్, అడ్వర్టైజ్మెంట్స్, ఫేక్ న్యూస్ వార్తలను కూడా పరిశీలించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రచారాల వివరాలను గమనిస్తూ వ్యయ వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ పర్యటనలో తాసిల్దార్ లు లక్ష్మీనారాయణ, భువనేశ్వర్, మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
