(తిమ్మాపూర్ సెప్టెంబర్ 22 )
మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో మానకొండూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు పడాల ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జనసేన క్రీయశీలక సభ్యత్వ కార్యక్రమం, ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ.. 500 రూపాయలు కట్టి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటే ఐదు లక్షలు ఇన్సూరెన్స్ అందిస్తున్నామని అన్నారు.. తెలంగాణలో ఏ పార్టీ కూడా పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు తీసుకున్న సభ్యులకు ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వలేదన్నారు. మా అధినేత పవన్ కళ్యాణ్ జన సైనికుడి ప్రతి కుటుంబానికి 5 లక్షల ఇన్సూరెన్స్ ఉండాలని ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి జన సైనికుడికి మెడికల్ బిల్లు 50 వేల వరకు వర్తిస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జనసేన సభ్యత్వం పొందిన 166 ఐడి కార్డులు పంపిణీ చేశారు….
ఈ కార్యక్రమంలో నాయకులు పైసా మోజేష్, గడ్డి శ్రీనివాస్, బండపెళ్లి మారుతిగౌడ్, సొల్లు రాకేష్, తూముల విష్ణు, కరికే శ్రీనివాస్, కొండికొప్పుల అనిల్, శ్రావణపెళ్లి కిరణ్,ముల్కల పవన్, పడాల రమణగౌడ్, పడాల లక్ష్మణ్ గౌడ్, పప్పు వెంకటేష్, తోట రాంబాబు, భూతం కళ్యాణ్
తదితరులు పాల్గొన్నారు…