తెలంగాణ చేనేత ఐక్య వేదిక ( 184 / 2023 )
హైదరాబాద్
అక్టోబర్ 18
చేనేత పారిశ్రామిక అభివృద్ధి గూర్చి వివిధ పార్టీల ఎన్నికల ప్రణాళికలో చేర్చాలి
చేనేత అధ్యక్షులు రాపోలు డిమాండ్
రాష్ట్రం లోరాబోయే సార్వత్రిక ఎన్నికల్లో చేనేతలకు ఎవరైతే అండగా ఉంటారో వారికి చేనేత సమాజం బాసటగా నిలుస్తామని
తెలంగాణ చేనేత ఐక్య వేదిక
అధ్యక్షులు రాపోలు వీర మోహన్ అన్నారు
మంగళ వారం రోజు భువనగిరి జిల్లా కేంద్రం లో తనని కలసిన పత్రికా మిత్రులతో ఇష్టా గోష్టి గా మాట్లాడారు
చేనేత కార్మికుల సంక్షేమం పరిశ్రమ
పరిరక్షణ మీద ప్రతి రాజకీయ పార్టీ
వారి వారి ఎన్నికల ప్రణాళికలో చేర్చాలని డిమాండ్ చేశారు
1 ప్రతి నేత కార్మిక కుటుంబానికి ప్రతి సంవత్సరం నేత కుటుంబాలకు
పది లక్షల చొప్పున ఆర్ధిక సహాయం అందించాలి
2 పూర్వ వైభవ దిశగా సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలి
3 చేనేత కార్పొరేషన్ కు @1000 కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేయాలి
4 ప్రతి జిల్లా కేంద్రం లో ఐదు ఎకరాల విస్తీర్ణం లో చేనేత పార్కులు ఏర్పాటు చేయాలి
5 జియో టాగ్ విధానం లో ఇంకా చేర్చవలసిన మగ్గాల పున పరిశీలన చేయాలి
ఇలాంటి ఇంకా ఎన్నో సమస్యల మీద రాష్ట్రం లో ఉన్న చేనేత ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు
ఈ సమావేశం లో చేనేత ఐక్య వేదిక నాయకులు పెంట బాలరాజు జెల్ల రఘు అందే జ్యోతి బొజ్జ శోభ సామల కనక రాజు బింగి భాస్కర్ పాల్గొన్నారు
