దసరా అనేది కేవలం మనకు ఒకరోజు పండగ మాత్రమే. కాని మన జీవితంలో మనం అనుభవించాల్సిన రోజులు చాలా ఉన్నాయని ఎల్లారెడ్డిపేట ఎస్సై వి శేఖర్ ఎల్లారెడ్డిపేట మండల ప్రజలను ఉద్దేశించి బుధవారం రోజున విలేకరులతో మాట్లాడారు.ముఖ్యంగా యువకులు త్రాగి వాహనాలు నడిపి మీరు మీ జీవితాలని కోల్పోవటం కాని, ఇతరుల కుటుంబాలలొ విషాదం నింపటం లాంటివి చేయవద్దని సూచించారు.అనవసర గొడవలకు పోయి కేసులలో ఇరుక్కుంటే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలకు అనర్హులు అవుతారు కనీసం పాస్పోర్ట్ రాదని గుర్తు చేశారు పిడి యాక్ట్ బైండోవర్ లు కావటం వలన మండలంలో ఏ చిన్న సమస్య వచ్చిన మిమ్మల్ని పోలీస్ స్టేషన్ లో బైండోవర్ చేస్తామన్నారుజీవితానికన్నా, కుటుంబానికన్నా ఏది ముఖ్యం కాదు. కుటుంబంతో ఆనందంగా గడుపుతూ, దసరా పండుగ జరుపు కోవాలని ఎల్లారెడ్డిపేట ఎస్సై వి శేఖర్ తెలిపారు పండుగ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల ప్రజలఅందరికి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు
