పల్లా ను ఓడించాలే డివిజన్ సాధించాలి
గద్దల మహేందర్
జేఏసీ డివిజన్ నాయకులు
అక్టోబర్ 12
సిద్దిపేట జిల్లా చేర్యాల మద్దూరు, కొమురవెల్లి, చేర్యాల, దూలిమిట్ట ,మండలాలను కలుపుతూ చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని సాగుతున్న రిలే నిరాహార దీక్షలో భాగంగా నేడు సిపిఎం డివిజన్ స్థాయి నాయకుల దీక్ష శిబిరంలో కి సంఘీభావం ప్రకటిస్తూ, జేఏసీ డివిజన్ నాయకులు గద్దల మహేందర్ మాట్లాడటం జరిగింది.
ఈ సంద్భంగా నేటికీ దీక్షలు 32వ రోజు కొనసాగుతున్నాయని, అయినా ప్రభుత్వం పట్టింపు లేని చర్యగా భావిస్తోందని, తెలుపుతూ, ఈ ప్రాంతానికి అధికార పార్టీ నేతల మాటల చేర్యాల ప్రాంతానికి శాపంగా మారినాయని, జీవో తెస్తానన్న పల్లా జీరో కాపీని చూపించారని తెలిపారు
ఈ ప్రాంత అభివృద్ధి మంత్రి కి, ఇష్టం లేదని స్పష్టంగా అర్థం అవుతుందనీ, ఈ ప్రాంత బిఆర్ఎస్ నాయకులు వారిని కలిసి వినతి పత్రాలు సమర్పించిన, సభలు సమావేశాలలో విన్నవించిన వేదనను విన్న నేపథ్యంలో పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజలు ఐక్యమత్యంతో ముందుకు కదలాలని, ప్రతి పల్లె దండై కదిలి ఈ ప్రాంత వెనుకబాటుకు కారణం తెలియజేస్తూ, అస్తిత్వం, ఆత్మగౌరవంకై ముందుకు సాగాలని ఈ డివిజన్ ఉద్యమంలో క్రియాశీలక భూమిక పోషిస్తున్న కామ్రేడ్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో మరింత ప్రజా ఉద్యమం నిప్పై రగులుతుందన్నారు. ఇది తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని కదులుతుందన్నారు.





