Breaking News

రెడ్డి సంఘ భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించండి.

130 Views

వర్గల్ మండల్ అక్టోబర్ 9 :రెడ్డి సంఘ భవన నిర్మాణానికి స్థలం కేటాయించండి.
మంత్రి హరీష్ రావుకు వినతి పత్రం అందజేత…

వర్గల్ మండల కేంద్రంలో రెడ్డి సంఘ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతూ సోమవారం ఉదయం రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావును వర్గల్ రెడ్డి సంఘం బాధ్యులు వేలూరి కృష్ణారెడ్డి , ఇర్రి రంగారెడ్డి , వేలూరి వెంకట్ రెడ్డి , రామకృష్ణారెడ్డి , శ్రీనివాస్ రెడ్డిల నేతృత్వంలో మంత్రి హరీష్ రావును కలిసి విజ్ఞప్తి చేశారు .

ముఖ్యంగా వర్గల్ మండల కేంద్రంలో రెడ్డి సంఘ భవన నిర్మాణానికి అనువైన ప్రభుత్వ స్థలం ఉందని , దీనిని దృష్టిలో పెట్టుకొని సహకారం అందించాలని వారు కోరారు . దీంతో ఆయన సానుకూలంగా స్పందిస్తూ రెడ్డి సంఘం బాధ్యులకు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో నేతలు రామచంద్రారెడ్డి , గోపాల్ రెడ్డి , మల్లారెడ్డి , బుచ్చిరెడ్డి , విష్ణువర్ధన్ రెడ్డి , సతీష్ రెడ్డి , రాజిరెడ్డి తదితరులు మంత్రి హరీష్ రావును కలిసిన ఉన్నారు .

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *