సిద్దిపేట జిల్లా: అక్టోబర్ 7
24/7 తెలుగు న్యూస్
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండపోచమ్మ ఆలయం హుండీని దేవాదాయ, ధర్మాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం లెక్కించారు. భక్తులు వివిధ కానుకల రూపంలో అమ్మ వారికి హుండీలో డబ్బులు వేసి ముడుపులు చెల్లించుకున్నారు.అమ్మవారికి 80 రోజులకు గాను 7,95,105 రూపాయల హుండీ ద్వారా ఆదాయం వచ్చినట్లు ఆలయ చైర్మన్ జంబుల శ్రీనివాస్ రెడ్డి దేవాదాయ శాఖ సూపరెండంట్ శివరాజ్, ఆలయ ఈవో మోహన్ రెడ్డి తెలిపారు.





