అక్టోబర్ 6 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్:
లక్షెట్టిపేట మున్సిపాలిటీ కార్యాలయంలో బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమం ప్రారంభించిడం జరిగింది
తెలంగాణ ఆడపడుచులకు కెసిఆర్ కానుక
ప్రతి ఏటా బతుకమ్మ చీరల పంపిణీ
నేతన్నలకు ఉపాధితో సంతోషం
గతంలో ఏ ప్రభుత్వాలకు రానీ ఆలోచన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందని, తెలంగాణా సంప్రదాయం ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల ఆడపడుచులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దసరా పండుగ కానుకగా బతుకమ్మ చీరల పంపిణీ చేయడం జరిగిందని, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపేల్లి దివాకర్ రావు అన్నారు.
ఈ మేరకు పేద ఇంటి ఆడపడుచులకు బతుకమ్మ దసరా పండుగ చీరలను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రతీ ఇంటికి పెద్ద అన్నలా బతుకమ్మ పండుగ పూట ఆడపడుచులకు బతుకమ్మ చీరలను అందిస్తున్నట్లు చెప్పారు.
