ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా బక్కి వెంకటయ్య ప్రమాణ స్వీకారం
సిద్దిపేట జిల్లా:అక్టోబర్ 04
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా బక్కి వెంకటయ్య ప్రమాణ స్వీకారం చేశారు.
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యాలయంలో మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో బక్కి వెంకటయ్య ప్రమాణస్వీకారం చేసి పదవి బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో పదవి ఇచ్చిన సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపి వారికి ఎల్లవేళలా రుణపడి ఉంటానని అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు నూతన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ సారూక్ హుస్సేన్, ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్, మదన్ రెడ్డి, నర్సింహారెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
