సిద్దిపేట: అక్టోబర్ 4
24/7 తెలుగు న్యూస్
సిద్దిపేట నియోజకవర్గంలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉంది. గ్రామంలోని వీధులలో గుంపులుగా తిరుగుతూ స్వైర విహారం చేస్తున్నాయి. కుక్కల బెడద కారణంగా ఇంటి నుంచి బయట కు రావడానికి వృద్ధులు, పిల్లలు భయాందోళనల చెందుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి ఈ సమస్యపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
