రెవిన్యూ డివిజన్ ఇవ్వకుంటే ప్రజలు ఓట్లతో బుద్ది చెప్తారు
జీవో తీస్కొని రాకుండా జనగామ ఎమ్మెల్యే సంఘీభావం తెలపడం సిగ్గు చేటు
బిజెపి యువమోర్చ జిల్లా అధ్యక్షులు బొంగోని సురేష్ గౌడ్
అక్టోబర్ 4
సిద్దిపేట జిల్లా : చేర్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో ఏర్పాటుచేసిన సమావేశంలో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న నేతాజీ యువజన సంఘం నాయకులకు పూల దండలేసి ప్రారంభించిన అంకుగారి శ్రీధర్ రెడ్డి , తదనంతరం
ఈ యొక్క దీక్షకు సంఘీభావం తెలిపి మాట్లాడిన బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షులు బొంగోని సురేష్ గౌడ్.మాట్లాడుతూ అన్ని హంగులు కలిగిన చేర్యాల ప్రాంతాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేసి ప్రాంత అస్తిత్వాన్ని దెబ్బతీశారని ప్రాంత అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం చేర్యాల రెవెన్యూ డివిజన్ కావడమే మన లక్ష్యమని అదే విధంగా పాత నియోజకవర్గాన్ని సాధించుకునే దిశగా చేర్యాల రెవెన్యూ డివిజన్ ఉద్యమాన్ని గత ఐదు సంవత్సరాల నుండి కొనసాగిస్తుందని,
ఈ ఎన్నికల ముందు చేర్యాల రెవెన్యూ డివిజన్ గా ఏర్పడేంతవరకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి రిలే నిరాహార దీక్షలో కూర్చోవడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు ఓట్లు కావాలంటే జీవో ఇవ్వాలని లేదంటే బీజేపీ అధికారంలోకి రాగానే జీవో తీసుకొస్తామని అన్నారు .
ఈ కార్యక్రమంలో ఫార్వర్డ్ బ్లాక్ అందె బీరన్న, కందుకూరి సిద్ధి లింగం గుప్తా, ఏఐఎస్బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు, జనగామ జిల్లా అధ్యక్షులు పాకాల ఈసాకు, రజక సంఘం జనగామ జిల్లా అధ్యక్షులు పోరండ్ల వెంకటేష్, రాంపురం కురుమ సంఘం అధ్యక్షులు శెట్టే ఓజయ్య శవాల కిష్టయ్య, టీడీపీ నాయకులు నర్ర కేశవులు, ఎమ్మార్పీఎస్ మద్దూరు మండల నాయకులు కొనపాక కనకస్వామి, స్టూడెంట్ బ్లాక్ నాయకులు వెల్ది సాయికిరణ్ రెడ్డి, ఎర్ర సంతోష్, స్వామి తదితరులు పాల్గొన్నారు.





