ముస్తాబాద్, సెప్టెంబర్28:
బందనకల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఒకేపార్టీలో అల్పెరుగకుండా కష్టపడుతూ పార్టీని నమ్ముకున్న తుపాకుల శ్రీనివాస్ గౌడ్ జిల్లా(ఓబిసి) కార్యదర్శిగా జిల్లాఅధ్యక్షులు కూస రవీందర్ నియమించారు. ఈనియామక పత్రాన్ని టీపీసీసీ రాష్ట్ర ప్రచారకమిటీ కన్వీనర్ అజ్మతుల్లా హుస్సేనీ చేతులమీదుగా అందజేశారు. ఈకార్యక్రమంలో టిపిసిసి మాజీ అధికార ప్రతినిధి చీటి ఉమేశ్ రావు, రాష్ట్ర ప్రచారకమిటీ సభ్యులు సంగీతంశ్రీనివాస్, యూత్ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనాథ్, మాజీ సర్పంచ్ ఓరగంటి తిరుపతి, ఓ.బీ.సి ఉపాధ్యక్షులు అగుళ్లరాజేశం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కటకం రాజశేఖర్ పాల్గొన్నారు. జిల్లానాయకులకు నాకు నియమిత పత్రాన్ని సహకరించిన సీనియర్ నాయకులకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు.




