
మాజీ ఎంపీపీ డాక్టర్ జాడి రామరాజు నేత
ములుగు,ఏటూరునాగారం,సెప్టెంబర్ 25
ఏటూర్ నాగారం మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కిషన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీపీ డాక్టర్ జాడి రామరాజు నేత మాట్లాడుతూ ఏటూర్ నాగారం రెవెన్యూ డివిజన్ తోపాటు బస్ డిపో నిర్మాణం కోసం చేసే నిరాహార దీక్షకు ప్రతి ఒక్కరు పార్టీలకతీతంగా మద్ద తు ఇవ్వాలని అన్నారు.అదేవి ధంగా కొంతమంది నాయకులు వారి ప్రయోజనాల కోసం రెవెన్యూ డివిజన్ బస్సు డిపోను అడ్డుకుంటున్నారు. అదేవిధంగా రెవెన్యూ డివిజన్ తో పాటు బస్ డిపో అయితే ఏటూరునాగారంలోని ఏజెన్సీ ప్రాంతాలు పూర్తిగా అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతాయని మేము చేసే నిరాహార దీక్షకు 27, 28 తారీకు రోజున పార్టీలకతీతంగా మద్దతు ఇచ్చి ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి కోసం పాటుపడాలని డాక్టరు జాడి రామరాజు నేత అన్నారు.




