-108 రోజులలోనే అయ్యప్ప ఆలయ నిర్మాణం
-పలువురిని ఆకట్టుకునే పందిర్ల శ్రీనివాస్ గురు స్వామి పూజా విధానం.
-ఉమ్మడి జిల్లా లోనే ఒక పల్లెటూరు లో గల ఏకైక అయ్యప్ప గుడి.
-ఒక్క అల్మాస్ పూర్ లోనే 10 మంది నారికేళ గురుస్వామి.
-ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా మండల పూజ మహోత్సవం.
-పెన్ పవర్ స్పెషల్ కథనం.
-అల్మాస్ పూర్ శీను గురుస్వామి తో పెన్ పవర్ ముఖాముఖి.
రాజన్న సిరిసిల్ల /నవంబర్ 26:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం ఆల్మాస్ పూర్ గ్రామంలో గత 30 సంవత్సరాల నుండి అల్మాస్ పూర్ గ్రామంలో నలుగురు ఐదుగురు తో ప్రారంభమైన టువంటి మాల ఈరోజు 50 నుండి 60 మంది వరకు అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నారు. 1994వ సంవత్సరానికి ముందు కొందరు ఉన్న దీక్ష తీసుకున్నప్పటికీ 1994వ సంవత్సరం నుండి శ్రీను గురు స్వామి ఇతర అయ్యప్పలు ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు దీక్ష తీసుకుంటున్నారు. ఏ ఒక్క సంవత్సరం విరామం లేకుండా అల్మాస్ పూర్ గ్రామంలో మాలధారులు ఉంటున్నారు. అప్పటి స్వాములు ఇరవై సంవత్సరాలకు ముందు కట్టిన నియమనిష్టలు అనగా బ్రష్ వేసుకోవడం,సబ్బుల,దువ్వేనల వాడకం ఉండకపోయేది. తీవ్రమైన టువంటి ఎముకలు విరిగే చలితో ఉన్నటువంటి నీటితో స్నానం చేసేది మరియు దూరంగా ఉన్నటువంటి వ్యవసాయ బావిలో స్నానం చేసి సన్నిధానం నకు తడిబట్టలతో వచ్చి పూజలు చేసుకునేది. అప్పుడు అందరూ ఆర్థికముగా లేకపోవడం వలన గజగజ వనికేటటువంటి చలిలో మోటార్ సైకిళ్లపై చేద్దర్లు కప్పుకొని వెళ్ళేది.1994 సంవత్సరాల నుండి సుమారుగా 10 సంవత్సరాల వరకు అల్మాస్ పూర్ గ్రామంలో ఎవరిదైనా గృహము కిరాయికి తీసుకుని అందరము కలసి సన్నిధానం ఒక్కటే వద్ద పెట్టుకునే వాళ్ళం.1994 సంవత్సరంలో మా ఊరి గ్రామ మధ్యలో ఒక పెంకుటిల్లు లో సీతారామ సమేత లక్ష్మణ విగ్రహాలు మరియు చిన్నా ఆంజనేయ స్వామి గుడి ఉండేది. ఒక్క సంవత్సరం శ్రీను గురు స్వామి వయస్సు 16 సంవత్సరాలు కన్నె స్వామి గా ఆ పెంకుటిల్లు సీతారామ లక్ష్మణ గుడి లో ఐదుగురు స్వాములతో సన్నిధానం ఏర్పర్చుకుని అప్పటి నుంచి ప్రారంభమైన దీక్ష అంచెలంచెలుగా స్వాములు పెరుగుతూ… ఇప్పటివరకు ప్రతి సంవత్సరం అల్మాస్ పూర్ గ్రామంలో దీక్షలు తీసుకుంటున్నారు. అప్పటికాలంలో ఎముకలు కొరికే చలిని లెక్కచేయకుండా పడిపూజలు లో భక్తులు వందలమంది గ్రామ ప్రజలు పూజలో పాల్గొనేవారు.శ్రీను గురు స్వామి కి రెండవ సంవత్సరం దీక్ష కత్తి స్వామి గా ఉన్నప్పుడు పరిచయమైన ముస్తాబాద్ కి చెందిన రాజు గురుస్వామి వెంట పూజలలో పాల్గొంటూ రాజు గురుస్వామి ఆశీస్సులతో 1996వ సంవత్సరంలో అనుభవం ఉన్న గురుస్వాములు లేకపోవడంతో తన మూడవ సంవత్సరంలో గంట స్వామి గా ఉన్నప్పుడే గురు బాధ్యతను అప్పజెప్పడు. అప్పటినుండి ఇప్పటివరకు గురుస్వామి గా తన శిష్యులను శబరిమల యాత్రకు తీసుకెళ్తున్నాడు. పెంకుటిల్లు గా ఉన్న సీతా రామాలయం ఒక మంచి దేవాలయ నిర్మాణం జరిగి 2002వ సంవత్సరంలో ప్రతిష్టాపన జరిగింది .2005వ సంవత్సరంలో రామాలయ దేవాలయ ప్రాంగణంలో చిన్న రూమ్ ఏర్పరుచుకుని ,అప్పటి నుండి ఇప్పటి వరకు వేర్వేరుగా కాకుండా ఓకే వద్ద సన్నిధానం ఏర్పరచుకున్నము. అల్మాస్ పూర్ గ్రామంలోని నిస్వార్ధమైన భక్తి తపనతో స్వామివారి శరణుఘోష లతో అల్మాస్ పూర్ గ్రామ ప్రజల పూర్వ జన్మ సుకృతం తో 2009వ సంవత్సరంలో నవంబర్ లో హరిహరపుత్ర అయ్యప్ప దేవాలయ నిర్మాణం కు భూమి పూజ జరిగినది.ఒక మారుమూల గ్రామం అయినటువంటి అల్మాస్ పూర్ గ్రామంలో అత్యధిక శాతం నిరుపేదలు ఆర్థికముగా లేనటువంటి వారు ఉండడం వలన గుడి నిర్మాణం కు అహర్నిశలు కష్ట పడటం జరిగింది.స్వయంగానే స్వాములు పునాది తీయడం, రాళ్ల గోడలు పెట్టడం, మట్టి రాళ్లు మోయడం ,స్వాములే స్వయంగా చేశారు. అతి తీవ్రమైన చలి కావడం వలన చేతులు పగిలి రక్తాలు కారినవి. ఇంకా ఇందులో విశేషం ఇట్టి పనులలో గ్రామ మహిళలు కూడా పాల్గొని ఇసుక మట్టి మోసారు.ఇట్టి నిర్మాణం కు తన కుటుంబాన్ని సైతం వదిలిపెట్టి ఇంటి బాగోగులు చూడకుండా ఊరూరు తిరుగుతూ 108 రోజులలోనే నిర్మాణాన్ని పూర్తి చేసి తేదీ. 27-03-2010 రోజున దేవాలయ ప్రతిష్ట పూజ్యశ్రీ మలయాళ సద్గురు రామానంద తీర్థ స్వామి గొల్లపల్లి గ్రామం మహబూబ్ నగర్ జిల్లా గారు,పూజ్య శ్రీ విష్ణు సేవానంద గిరి స్వామి మలయాళ సద్గురు సన్యాస మఠం గీత ఆశ్రమం కరీంనగర్ వారిచే ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇట్టి ప్రతిష్ట అయ్యప్ప జన్మ దినం ఉత్తర పాల్గుని నక్షత్రమున జరగడం విశేషం.దేవాలయమునకు నాలుగు స్తంభాలుగా నాగలి ఇంద్రారెడ్డి గురుస్వామి, కీర్తిశేషులు ఓరుగంటి నరసింహా రెడ్డి గురు స్వామి, శెట్టిపల్లి బాలయ్య గురు స్వామి, భూపాల్ రెడ్డి గురు స్వామి నిధులు చేకూర్చారు.ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి వారిని ఏనుగు అంబారి పై ఎల్లారెడ్డిపేట మండలం మొత్తం ఊర్లలో ఊరేగింపుగా తీసుకు వచ్చే గణపతి సుబ్రహ్మణ్య అయ్యప్ప స్వామి విగ్రహాలను ప్రతిష్ఠాపన చేశాము. గుడి నిర్మాణమునకు ఊరులోని 18 మంది స్వాములు 41 రోజులు మళ్లీ దీక్ష తీసుకొని ప్రతిష్టాపన చేయడం విశేషం. ఇట్టి ఆలయమునకు మహా దాతలు గా అయ్యప్ప స్వామి విగ్రహం సిరిగిరి రమేష్ సిరిసిల్ల గారు ధ్వజస్తంభం మరియు రెండు లక్షల రూపాయలు విరాళం, పెద్ద మల్ల దేవయ్య రాజన్నాపేట గారు దేవాలయ గ్రానైట్ మరియు రెండు లక్షల రూపాయల విరాళం ,అల్మాస్ పూర్ గ్రామమునకు చెందిన సిరిసిల్ల జయరామ్ రిటైర్డ్ అసెంబ్లీ సెక్రటరీ గారు ,ఈ విధంగా ఎంతో మంది దాతల తో ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక మారుమూల గ్రామంలో అయ్యప్ప దేవాలయం ఇదే మొదటిది. అప్పటినుండి ఇప్పటివరకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న మండల మహా పడిపూజ కార్యక్రమమును ఉత్తర నక్షత్ర పూజలు వార్షికోత్సవం లు అంగరంగ వైభవంగా జరుప బడుచున్నవి .అవే కాకుండా విశేషమైన పూజలు ..శత చండీ యాగం ,శత రుద్రాభిషేకం ,సుబ్రహ్మణ్య షష్టి, ముక్కోటి ఏకాదశి ,గీత జయంతి ,సహస్ర కలశాభిషేకం లు ,మండల కాలం గణపతి హోమం నిర్వహించాము. దేవాలయం 11 సంవత్సరములు పూర్తిచేసుకుని 2022 వ సంవత్సరం ఏప్రిల్ 15 వ తేదీన పుష్కర కుంభాభిషేకం జరుపుకుంటున్నది.అల్మాస్ పూర్ గ్రామంలో మండలం తో పోల్చిచూస్తే ఎక్కువమంది అయ్యప్ప మాల దీక్ష తీసుకుంటారు అదేవిధంగా రెడ్డి పేట మండలంలోనే18 సంవత్సరాలు పూర్తిచేసుకున్న మొదటివాడు పందిళ్ళ శ్రీనివాస్ గురు స్వామి,2011 వ సంవత్సరంలో 18 శబరియాత్ర చేశాడు.అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 18 వ శబరిమల యాత్ర పూర్తి చేసుకున్న గురు స్వాములు ఎక్కువగా గా గల గ్రామం అల్మాస్ పూర్. అయ్యప్ప స్వాములు అంటేనే మంచి భజన ,నియమనిష్టలు, క్రమశిక్షణ ,భక్తిశ్రద్ధలతో ఉంటారు.
నారికేల గురు స్వాములు:
పందిళ్ళ శ్రీనివాస్ స్వామి
నాగేంద్ర ఇంద్ర రెడ్డి స్వామి
ఓరుగంటి నరసింహా రెడ్డి స్వామి
ఉచ్చిడి భూపాల్ రెడ్డి స్వామి
ఉచ్చిడి సత్తి రెడ్డి స్వామి
ఉచ్చిడిపద్మా రెడ్డి స్వామి
ఉచ్ఛిడిగోపాల్ రెడ్డి స్వామి
వంగల శ్రీనివాస్ రెడ్డి స్వామి
ఉచ్చడి రాజు స్వామి పప్పుల కిరణ్ స్వామి లు ఉన్నారు ప్రతి ఒక భక్తుడు అల్మాస్ పూర్ అయ్యప్పను వేడుకొనగానే అభయం ఇస్తాడని నమ్మకం ప్రతి భక్తుల్లో ఉంటుంది.
