ప్రాంతీయం

చిరకాల ఆకాంక్ష నెరవేరింది 

297 Views

మండల ఏర్పాటుతో సంబరాలు

 

కేసిఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు

 

మల్లంపల్లి ప్రజలకు శుభాకాంక్షలు

 

సంబరాల్లో పాల్గొన్న జడ్పీ చైర్ పర్సన్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి

 

ములుగు జిల్లా,సెప్టెంబర్ 23

 

మల్లంపల్లి ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన మల్లంపల్లిని మండలంగా ప్రకటిస్తానని చెప్పిన కేసిఆర్ నేడు ఇచ్చారని ఇది ఎంతో సంతోషకరమైన నిర్ణయమని ములుగు జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు.ఈసందర్బంగా ఆమె ముఖ్యమంత్రి కేసిఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపు తూ మల్లంపల్లి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారితో కలిసి మల్లంపళ్లి మండల సంబురా లలో దివంగత జడ్పీ చైర్మెన్ కుసుమ జగదీశ్వర్ తండ్రి ఆది నారాయణ పాల్గొన్నారు.ర్యాలీ నిర్వహించి స్వీట్లు పంపిణీ చేస్తూ బాణా సంచా కాలుస్తూ సంబరాల్లో పాల్గొన్నారు.ఈ మేరకు ఆమె మాట్లాడుతూ మంత్రి కేటిఆర్ హరీష్ రావు ఎర్రబెల్లి దయాకర్ రావు సత్యవతి రాథోడ్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పల్లా రాజేశ్వర్ రెడ్డి వి ప్రకాష్ సతీష్ రెడ్డి కాకులమర్రి లక్ష్మణ్ రావు తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.తెలంగాణ ప్రజల మనసు ఎరిగిన నేత ముఖ్య మంత్రి కేసిఆర్ అని ఎన్నో సంవత్సరాలుగా మల్లంపల్లి ప్రజలు కోరుకున్నట్లు ఈ రోజు ముఖ్యమంత్రి కేసిఆర్ మల్లం పల్లి మండలంగా ప్రకటించారని రానున్న రోజులలో మల్లంపల్లి అన్ని విధాలుగా అభివృద్ది చేందే విధంగా ప్రత్యేక శ్రద్ద తీసు కుంటానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకు లమర్రి లక్ష్మణ్ బాబు గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసిఆర్ ఇచ్చిన మాట ప్రకారం మల్లం పల్లి మండలంగా ఏర్పాటు చేసిన ములుగు జిల్లాపై ఆయనకున్న ప్రత్యేక శ్రద్దను మరోసారి నిరూపించారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పరిపా లన సౌలభ్యం కోసం నూతన మండలాలను ఏర్పాటుచేసిన అది కేవలం ముఖ్యమంత్రి కేసిఆర్ కు తెలంగాణ అభివృ ద్దిపై ఆయనకున్న ఆలోచన లకు నిలువెత్తు నిదర్శనమని ఆయన కొనియాడారు.ఈ కార్యక్రమంలో మల్లంపల్లి ప్రజలు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *