రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో కుంకుమ పూజలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని శనివారం రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక వేద బ్రాహ్మణుడు దయానంద్ శర్మ ఆధ్వర్యంలో వినాయకుడి ముందు కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా వినాయక చవితి పురస్కరించుకొని ఏడవ వార్షికోత్సవ సందర్భంగా మహిళల చే కుంకుమ పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది మహిళలు యూత్ సభ్యులు పాల్గొన్నారు.
