*_రోడ్డు ప్రమాదంలో గీత కార్మికుడి దుర్మరణం_*
_సిద్దిపేటజిల్లా :గుర్తు తెలియని వాహనం ఢీకొని గీత కార్మికుడు మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలోని కాళ్లకుంట కాలనీ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యలు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట అర్బన్ మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన అంబటి గణేష్ గౌడ్ (40) చిన్న కోడూరు మండలం పెద్ద కోడూరు కల్లు మండువా నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గణేష్ గౌడ్ మోటార్ సైకిల్ పై స్వగ్రామం నుంచి పెద్ద కోడూరుకు వెళ్తున్న క్రమంలో సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి కాళ్లకుంట కాలనీ బైపాస్ లో వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గణేష్ గౌడ్ రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడి పోయాడు. స్థానికులు గమనించి 108కు సమాచారం అందజేయగా వారు వచ్చి పరీక్షించి చని పోయినట్లుగా నిర్దారించారు. గణేష్ గౌడ్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి…





